VIDEO: శ్రీకాకుళం జిల్లా సమస్యలు సీఎం పరిష్కరించాలి

శ్రీకాకుళం జిల్లాలోని సమస్యలు ముఖ్యమంత్రి చంద్రబాబు పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు డిమాండ్ చేశారు. శుక్రవారం శ్రీకాకుళంలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలో భాగంగా ఇటీవల ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. జిల్లాకు ITDA ఏర్పాటు చేయాలన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు.