నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
GNTR: దుగ్గిరాల మండలం చిలువురులోని 33/11 కేవీ సబ్‌స్టేషన్ పరిధిలో కొత్త లైన్ల ఏర్పాటు కారణంగా ఇవాళ విద్యుత్ నిలిపివేయబడుతుందని ఏఈ గోపి తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మంచికలపూడి ఫీడర్ పరిధిలోని కంటంరాజు కొండూరు, మంచికలపూడి గ్రామాలకు, అలాగే, వ్యవసాయ సర్వీసులకు విద్యుత్ ఉండదన్నారు. ఆయా గ్రామాల ప్రజలు, రైతులు సహకరించాలని ఆయన కోరారు.