అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

W.G: తణుకు పట్టణం 9వ వార్డులో ఎన్టీఆర్ పార్కు అభివృద్ధి పనులకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమంలో ఆదివారం ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొన్నారు. రూ. 94.50 లక్షలతో మొదటి విడత పనులు ప్రారంభం కానున్నాయన్నారు. తణుకు పట్టణ అభివృద్ధికి కట్టుబడి ముందుకు సాగుతున్నామని తెలిపారు. మన ప్రజలకు కావాల్సిన మౌలిక వసతుల కల్పనకు నిధుల కోసం ఎంతో కృషి చేస్తున్నామన్నారు.