గుడివాడలో గ్రంధాలయాల 58వ వారోత్సవాలు
కృష్ణా: గుడివాడలోని షా గులాబ్ చంద్ గ్రంథాలయంలో 58వ గ్రంథాలయాల వారోత్సవాలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త, నవభారత్ ఖాదీ స్టోర్స్ అధినేత సయ్యద్ గఫార్ మాట్లాడుతూ.. గ్రంథాలయ వారోత్సవాల్లో చిన్నారులను ప్రోత్సహించేందుకు పలు పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు.