సోమవారం పీజీఆర్ఎస్ రద్దు
VSP: మహాశివరాత్రి పర్వదినం, అలాగే ఐఎఫ్ఆర్–2026 ఏర్పాట్ల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నందున సోమవారం నిర్వహించాల్సిన పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని, తదుపరి పీజీఆర్ఎస్ తేదీని త్వరలో ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు.