రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న అదనపు కలెక్టర్
WNP: ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి, రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ ఆదేశించారు. సోమవారం పెబ్బేరు మండలంలోని వివిధ ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. కేంద్రంలో ఉన్న రైతులతో నేరుగా మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు కూడా ధాన్యం శుభ్రం చేసి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు.