మత్సకారుల ప్రాణాలకు భరోసా..!

SKLM: మత్సకారుల భద్రతకు కేంద్ర ప్రభుత్వం శాటిలైట్ ఆధారంగా పని చేసే ట్రాన్స్‌పాండర్ యంత్రాలను అందుబాటులోకి తెచ్చింది. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు తిరిగి ఒడ్డుకు చేరే వరకూ ఎలాంటి సమాచారం ఉండదు. ఈ నేపథ్యంలో వీటిని మత్స్యశాఖ ద్వారా 100 శాతం రాయితీ పై పంపిణీ చేస్తున్నారు. మత్స్యకారులు సముద్రంలో ఉన్నప్పుడు ట్రాన్స్‌పాండర్ దిక్సూచిలా పని చేస్తుంది.