నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
SKLM: కవిటి మండలం బోరివంక విద్యుత్ ఉపకేంద్ర పరిధిలో శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ ఈఈ యజ్ఞేశ్వరరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మాణిక్యపురం, బల్లిపుట్టుగ, తదితర గ్రామాల్లో మరమ్మతుల కారణంగా ఈ అంతరాయం ఏర్పడుతుందన్నారు. వినియోగదారులు గమనించాలన్నారు.