VIDEO: కౌలు రైతు ఆత్మహత్య వీడియో వైరల్
ADB: ఆదిలాబాద్ రూరల్ మండలంలోని ఆర్లి గ్రామానికి చెందిన రైతు తుడుం గణపతి ఈనెల 19న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొన్ని రోజుల క్రితం ఖరీఫ్ పంట అమ్ముకోవడానికి వ్యవసాయ మార్కెట్‌కు వచ్చిన సమయంలో రైతు ఆవేదనతో మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు రైతుల పాలిట శాపంగా మారాయని కన్నీటి పర్యంతమయ్యాడు.