వైసీపీ నేతలు బూటకపు దీక్షలు మానుకోవాలి: ఎమ్మెల్యే

వైసీపీ నేతలు బూటకపు దీక్షలు మానుకోవాలి: ఎమ్మెల్యే

కోనసీమ: ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరుగుతుందని వైసీపీ నేతలు కలెక్టరేట్ ఎదుట చేస్తున్న రిలే దీక్షలు బూటకపు దీక్షలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. వాడపాలెం క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. రైతుల ప్రయోజనాలు కాపాడడం కోసం, ఒకపక్క ప్రభుత్వం కృషి చేస్తుంటే వైసీపీ నేతలు నాటకాలు మొదలుపెట్టారని విమర్శించారు.