మున్సిపల్ హైస్కూల్‌లో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం

మున్సిపల్ హైస్కూల్‌లో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం

సత్యసాయి: ధర్మవరం పట్టణం కొత్తపేట ప్రభుత్వ మున్సిపల్ హైస్కూల్‌లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ శనివారం పాల్గొన్నారు. విద్యార్థులతో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించగా, పరిశుభ్రత మరియు పర్యావరణ పరిరక్షణపై చిన్నప్పటి నుంచే అవగాహన పెంచుకోవడం సమాజానికి మేలు చేస్తుందని పేర్కొన్నారు.