గంజాయి రవాణా.. ముగ్గురు అరెస్ట్
NTR: నగరంలో గంజాయి రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. హనుమాన్ పేట వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న తమిళనాడుకు చెందిన రాజేశ్, నవీన్, మిధున్లను తనిఖీ చేయగా.. వారి వద్ద 16 కిలోల గంజాయి బయటపడింది. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. గంజాయి బ్యాగులను స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.