అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన శ్రీనివాస్ రెడ్డి
MDK: చేగుంట మండలం చిట్టోజి పల్లి గ్రామంలో అగ్ని ప్రమాద బాధితులను కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. శనివారం అగ్నిప్రమాదంలో ఇల్లు కోల్పోయిన శ్యామల నరసయ్యను పరామర్శించారు. వారికి ప్రభుత్వం పరంగా ఆదుకుంటామని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు.