బైకులు ఢీకొని యువకులకు గాయాలు
GNTR: కొల్లిపరలో ఆదివారం రెండు స్కూటీ బైకులు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో బెల్లంకొండకు చెందిన సందీప్‌కు తీవ్ర గాయాలవ్వగా, తెనాలి యువకుడికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని కొల్లిపరలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.