తప్పిన పెను ప్రమాదం

తప్పిన పెను ప్రమాదం

KMM: వీయం.బంజర్ రింగ్ సెంటర్‌లో గ్రానైట్ రాళ్లతో వెళ్తున్న ఓ లారీలో నుంచి అదుపుతప్పి గ్రానైట్ రాళ్లు రోడ్డుపై పడ్డాయి. స్థానికుల కథనం మేరకు.. సత్తుపల్లి రోడ్డులో గ్రానైట్ రాళ్లతో వెళ్తున్న ఓ లారీలో నుంచి రాళ్లు పడిపోయినట్లు తెలిపారు. ఇవాళ తెల్లవారుజామున కావటం వలన ఏలాంటి ప్రమాదం జరగలేదన్నారు. స్థానికులు లారీ డ్రైవర్‌ను వెంబడించగా అతడు పరారైనట్లు పేర్కొన్నారు.