లక్కీ డ్రా ద్వారా రూ.500కే రూ.16 లక్షల ఇల్లు సొంతం
SRD: జిల్లాకు చెందిన 10నెలల పాప హన్సికను అదృష్టం వరించింది. BHNG జిల్లా చౌటుప్పల్లో కంచర్ల రామబ్రహ్మం అనే వ్యక్తి రూ.16 లక్షల విలువైన ఇంటిని లక్కీ డ్రా ద్వారా విక్రయించారు. సుమారు 3,600 కూపన్‌లను రూ.500 చొప్పున అమ్మడం జరిగగా, ఇవాళ జరిగిన డ్రాలో జిల్లాకు చెందిన 10 నెలల చిన్నారి హన్సిక విజేతగా నిలిచింది. ఈ పద్ధతి ద్వారా రూ.3 లక్షల లాభం వచ్చినట్లు యజమాని పేర్కొన్నారు.