చేపలు అమ్మడానికి సబ్సిడీపై వాహనాలు

చేపలు అమ్మడానికి సబ్సిడీపై వాహనాలు

NGKL: జిల్లాలో మత్స్యకారులకు సబ్సిడీపై వాహనాలు ఇవ్వనున్నట్లు జిల్లా మత్స్యశాఖ అధికారి నరసింహారావు తెలిపారు. PM మత్స్య సంపద యోజన పథకంలో భాగంగా 13 మోటార్ సైకిల్స్, అదేవిధంగా ఐస్ బాక్స్లు మంజూరు అయినట్లు తెలిపారు. ఒక్క యూనిట్ 75,000 ఉంటుందని, అందులో జనరల్ 7, మహిళలకు 2, ఎస్సీ 2, ఎస్టి 2, జనరల్ కు 40 శాతం, ఎస్సీ ఎస్టీలకు 60% సబ్సిడీ ఉంటుందని తెలిపారు.