'బసవేశ్వర సేవలు మారువలేనివి'

'బసవేశ్వర సేవలు మారువలేనివి'

NZB: బోధన్ మండలం కండ్గావ్ గ్రామంలో మహాత్మా బసవేశ్వరుడి జయంతిని ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ సునీత మహాత్మా బసవేశ్వరుని చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు చేశారు. మహాత్మా బసవేశ్వర సమాజంలో సమానత్వం, న్యాయం, ధర్మం కోసం కృషి చేసిన మహానుభావులని సర్పంచ్ సునీత అన్నారు. ఆయన చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.