పులిచెర్లలో పంటలను ధ్వంసం చేసిన ఒంటరి ఏనుగు

పులిచెర్లలో పంటలను ధ్వంసం చేసిన ఒంటరి ఏనుగు

CTR: పులిచెర్ల మండలంలో పంటలపై ఒంటరి ఏనుగు దాడులు మళ్లీ మొదలయ్యాయి. పాలెం పంచాయితీ కేంద్రంలో రైతు మురళీధరర్‌కు చెందిన టమాటా పంట, డ్రిప్ పైపులను ఒంటరి ఏనుగు శుక్రవారం ధ్వంసం చేసింది. అనంతరం సమీపంలోని పలువురు రైతుల మామిడి చెట్లను ధ్వంసం చేసింది. ప్రస్తుతం సమీపంలోని అడవిలోకి ఏనుగు చేరుకున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.