సత్య కళాశాలలో వెటర్నరీ శిబిరం
VZM: తోటపాలెం, సత్య కళాశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న NSS ప్రత్యేక శిబిరం ఆరో రోజు సందర్భంగా వెటర్నరీ (పశు వైద్య) శిబిరాన్ని ఇవాళ విజయవంతంగా నిర్వహించారు. ఈ శిబిరంలో గ్రామంలోని పశువులకు ఉచిత వైద్య పరీక్షలు, టీకాలు, పురుగుల నివారణ మందులు అందించారు. వెటర్నరీ వైద్యులు డాక్టర్ మోహన్, కళాశాల డైరెక్టర్ ఎం శశి భూషణరావు పాల్గొన్నారు.