విద్యుత్ షాక్‌తో మహిళా మృతి

KMM: విద్యుత్ షాక్‌తో మహిళా మృతి చెందిన ఘటన సోమవారం మధిర పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని ఎస్సీ కాలనీకి చెందిన పగిడిపల్లి నీలమ్మ విద్యుత్ షాక్‌తో మృతి చెందిందని స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.