నేడు అలంపూర్‌లో న్యాయవాదుల పాదయాత్ర

నేడు అలంపూర్‌లో న్యాయవాదుల పాదయాత్ర

GDWL: తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదులపై జరుగుతున్న దాడులు అరికట్టాలని బార్ అసోసియేషన్ సభ్యులు పిలుపినిచ్చారు. ఈ మేరకు అలంపూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇవాళ ఉదయం 9:00 గంటలకు శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర ఆలయం నుంచి హైదరాబాద్ వైపు పాదయాత్ర చేపడుతున్నట్లు శనివారం పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా న్యాయ బంధువులందరూ పాల్గొని ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు.