10 మిస్సైళ్లను ప్రయోగించిన ఉత్తర కొరియా
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ ఉత్తర కొరియా ఒక్కసారిగా అలజడి సృష్టించింది. జపాన్ వైపు సముద్రంలో 10 బాలిస్టిక్ మిసైళ్లను ప్రయోగించింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా ధ్రువీకరించింది. రాజధాని ప్యాంగ్‌యాంగ్ సమీపం నుంచి ఈ క్షిపణులు ప్రయోగించినట్లు పేర్కొంది. అయితే అమెరికాతో కలిసి దక్షిణకొరియా చేపట్టిన సంయుక్త విన్యాసాలకు ప్రతిగా క్షిపణులు ప్రయోగించినట్లు సమాచారం.