విశాఖకు మళ్లీ ఐబీఎం రాక

విశాఖకు మళ్లీ ఐబీఎం రాక

VSP: ప్రసిద్ధ ఐటీ కంపెనీ ఐబీఎం మళ్లీ విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. ఇక్కడి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ)లో ఐబీఎం ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రిజిస్టర్ చేసుకుంది. రాబోయే మూడేళ్లలో రూ. 322 కోట్ల విలువైన ఐటీ ఉత్పత్తులు ఎగుమతి చేస్తామని ప్రకటించింది. దీని ద్వారా 502 మందికి ఉద్యోగాలు వస్తాయని పేర్కొంది.