పిల్లి రాజశేఖర్‌కు ఘన నివాళులు
GNTR: తెనాలి మండలం కట్టేవరం గ్రామంలో జనసేన నేతలు పిల్లి రాజశేఖర్ అకాల మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన భౌతిక కాయానికి ఘన నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్ట సమయంలో పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.