VIDEO: 'తడిచిన ధాన్యానికి మద్దతు ధర కల్పించాలి'
BDK: దుమ్ముగూడెం మండలం సీపీఐ ఎంఎల్ ప్రజా పంద ఆధ్వర్యంలో తాహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. మండల కార్యదర్శి సాయిబాబా మాట్లాడుతూ.. రైతులు పండించిన అన్ని రకాల ధాన్యాలను మద్దతు ధర కల్పించి, భారీ తుఫాన్‌కు నష్టపోయిన పంటకు అంచనా వేసి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్, ఎంపీడీవోలకు వినతి పత్రం అందజేశారు.