ఈతకు వెళ్లి బీటెక్ విద్యార్థి మృతి

KDP: పులివెందుల పరిధిలోని పెద్ద రంగాపురం చెందిన నాదెండ్ల అన్వర్ గురువారం ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. స్థానికుల వివరాలు మేరకు.. అన్వర్ చిత్తూరు జిల్లా పుత్తూరులోని బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు. సెలవులు కావడంతో స్నేహితులతో కలిసి రాయలపురం సమీపంలోని కుంట వద్దకు ఈతకు వెళ్లగా.. అన్వర్ ఈత కొడుతూ నీటిలో మునిగి మృతి చెందాడు.