డ్రైన్ల శుభ్రంపై దృష్టి పెట్టాలి: కమిషనర్

GNTR: గుంటూరులోని అంతర్గత డ్రైన్ల శుభ్రంపై ప్రజారోగ్య అధికారులు, కార్మికులు ప్రత్యేక దృష్టి సారించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు సూచించారు. వ్యర్థాలు డ్రైన్లలో వేసే వారిపై భారీ అపరాధ రుసుం విధించాలని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం కేవీపీ కాలనీ, ఏటుకూరు రోడ్, పొన్నూరు రోడ్, సంగడిగుంట ప్రాంతాల్లో పర్యటించి డ్రైన్లను పరిశీలించారు.