గుండెపోటుతో హోంగార్డ్ మృతి

గుండెపోటుతో హోంగార్డ్ మృతి

ప్రకాశం: మార్కాపురం పట్టణ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ గాలయ్య (50) గుండెపోటుతో మృతి చెందాడు. మంగళవారం ఉదయం ఎప్పట్లాగానే విధులు నిర్వహిస్తున్న గాలయ్య గుండెనొప్పి అని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళగానే గుండెపోటు పెరగడంతో మార్కాపురం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే గాలయ్య మృతి చెందినట్లుగా వైద్యలు తెలిపారు.