పెళ్లైన మూడు నెలలకే నవవధువు ఆత్మహత్య

పెళ్లైన మూడు నెలలకే నవవధువు ఆత్మహత్య

TG: హైదరాబాద్ మూసాపేటలో వివాహమైన 3 నెలలకే నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. ప్రొద్దుటూరు(కడప)కు చెందిన చందన జ్యోతి, కొత్తగూడెం(భద్రాద్రి)వాసి యశ్వంత్ పెళ్లి అనంతరం మూసాపేటలో ఉంటున్నారు. ఈ క్రమంలో ఇద్దరికీ తరచూ గొడవలు అవుతుండటంతో మనస్తాపానికి గురైన చందన శుక్రవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన భర్త ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో చనిపోయింది.