వర్షాలపై సీఎస్‌తో చంద్రబాబు సమీక్ష

AP: వర్షాలపై CS విజయానంద్‌తో CM చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఉత్తరాంధ్రలో పరిస్థితిని సీఎంకు సీఎస్ వివరించారు. అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేయాలని సీఎం ఆదేశించారు. ఉత్తరాంధ్రలో పరిస్థితుల దృష్ట్యా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చపట్టాలన్నారు. భారీ వర్షాలు కొనసాగితే విద్యాసంస్థలకు సెలవు ఇవ్వాలని సీఎం తెలిపారు.