రోడ్డుపై ఆక్రమణల తొలగింపు.. HIT TV కథనానికి స్పందన
SRPT: సూర్యాపేట పోస్ట్ ఆఫీస్ సమీపంలో రోడ్డుపై నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన టిఫిన్ సెంటర్ల బోర్డులు, బల్లలపై అధికారులు కొరడా ఝుళిపించారు. ఫిబ్రవరి 18న ‘హిట్ టీవీ యాప్’లో వచ్చిన కథనానికి స్పందించిన ట్రాఫిక్ ఎస్సై సాయిరాం, సిబ్బందితో కలిసి ఆక్రమణలను తొలగించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా వ్యాపారులను హెచ్చరించారు.