'ఇంటర్ ప్రవేశాలకు స్పాట్ కౌన్సిలింగ్'

WNP: గోపాల్ పేట మండలం బుద్ధారం గ్రామంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఇంటర్ మహిళల కళాశాలలో మిగిలిన సీట్ల భర్తీకి రేపు కళాశాలలో స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. పదవ తరగతి మార్కుల ఆధారంగా సీట్లు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి గలవారు ధ్రువ పత్రాలతో హాజరు కావాలన్నారు.