పేకాట శిబిరంపై దాడి.. నలుగురు అరెస్ట్
గుంటూరు జిల్లా చేబ్రోలులోని శలపాడులో పోలీసులు పేకాట శిబిరంపై దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.20,000ల నగదు, 4 ద్విచక్రవాహనాలు, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా చేబ్రోలులో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.