ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు దుర్మరణం

KMR: బాన్సువాడ మండలంలోని బొర్లం క్యాంప్ శివారులో గురువారం ఆర్టీసీ బస్సు టీవీఎస్ ఎక్సెల్‌ను ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. మృతులు సోమ్లా నాయక్ తండాకు చెందిన రమావత్ గోవింద్, రమావత్ రాములుగా గుర్తించారు. పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వీరిని కామారెడ్డికి వెళ్తున్న బస్సు ఢీకొట్టింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.