భక్తులతో కిటకిటలాడిన మద్దిక్షేత్రం

భక్తులతో కిటకిటలాడిన మద్దిక్షేత్రం

ELR: జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం శ్రీమద్ది ఆంజనేయస్వామి వారి క్షేత్రంలో జరుగుతున్న కార్తీక మాస మహోత్సవాల్లో భాగంగా శనివారం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో మహిళా భక్తులు 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం పఠించారు.