పర్యావరణ పరిరక్షణకు ‘ఏక్ దిన్ ఏక్ సాత్ ఏక్ బ్యాగ్’ కార్యక్రమం
VSP: జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోరమాండల్ ఇంటర్నేషనల్ సహకారంతో విశాఖ నగరంలోని 32 ప్రాంతాల్లో 'ఏక్ దిన్ ఏక్ సాత్ ఏక్ బ్యాగ్' కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. గోపాలపట్నం, గాజువాక, పెందుర్తి, కంచరపాలెం, మురళీనగర్, మల్కాపురం తదితర ప్రాంతాల్లో ఫౌండేషన్ సభ్యులు వస్త్ర సంచులు పంపిణీ చేశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం ఆరోగ్యానికి, పర్యావరణానికి హానికరమన్నారు.