VIDEO: అనుమానాస్పదంగా వ్యక్తి మృతి
TPT: జిల్లాలో విషాద ఘటన జరిగింది. పాకాల మండలం దామలచెరువు పంచాయతీ కుక్కలపల్లి సమీపంలోని లింగన్న చెరువులో పడి ఝార్ఖండ్‌కు చెందిన మాణిక్ బౌరీ (40 మృతి చెందాడు. ఆయన స్థానిక ఇటుక బట్టీల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం నుంచి అదృశ్యమవ్వగా తాజాగా చెరువులో శవమై తేలాడు. ఇది హత్య, ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.