ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి

ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి

తిరుపతి జిల్లాలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వడమాలపేట మండలం తడుకు రైల్వే స్టేషన్ సమీపంలో తిరుపతి-చెన్నై హైవేపై నడిచి వెళ్తున్న ఇద్దరిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆ ఇద్దరూ చనిపోయారు. మృతులు విజయపురం మండలం KVపురం గ్రామానికి చెందిన రంజిత్ నాయుడు(52), వడమాలపేట మండలం SBRపురంకు చెందిన బాబురాజుగా గుర్తించారు.