VIDEO: 'వైభవంగా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనం ఉత్సవం'

ADB: తాంసి మండలంలోని కప్పర్ల శ్రీరామ మందిరంలో గణేష్ నిమజ్జనం ఉత్సవ కార్యక్రమం శనివారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయంలో భజన సంకీర్తన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం శ్రీ సీతారామ విగ్రహాలకు పాలాభిషేకం కార్యక్రమం, భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసినట్లు ఆలయ అర్చకులు విశాల్ శర్మ తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు మహిళలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.