ఎస్పీ కార్యాలయంలో వందేమాతరం గీతాలపన

ఎస్పీ కార్యాలయంలో వందేమాతరం గీతాలపన

SRD: వందేమాతరం గేయాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ పరితోష్ పంకజ్ ఆధ్వర్యంలో వందేమాతరం గేయాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రఘునందన్ రావ్, ఎఆర్ డీఎస్పీ నరేందర్, ఇన్‌స్పెక్టర్ రమేష్, కిరణ్ కుమార్, నాగేశ్వర్ రావు, రామారావు, రాజశేఖర్ రెడ్డి, డానియెల్, శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.