‘ఒత్తిడి లోనయ్యే పోలీసులకు యోగ ఎంతో ఉపయోగం’

‘ఒత్తిడి లోనయ్యే పోలీసులకు యోగ ఎంతో ఉపయోగం’

ఏలూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో ఇవాళ సిబ్బంది సామూహిక యోగాసనాల సాధన కార్యక్రమం నిర్వహించారు. యోగా వేడుకల్లో ఏఆర్ అదనపు ఎస్పీ ముని రాజా పాల్గొని యోగా ప్రాముఖ్యతను వివరించారు. యోగా కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, మానసిక ప్రశాంతతకు, ఒత్తిడి నియంత్రణకు ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఒత్తిడికి లోనయ్యే పోలీసు సిబ్బందికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.