రాజన్నకు రూ.1.29 కోట్ల హుండీ ఆదాయం
SRCL: వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పరిధిలోని భీమేశ్వరాలయంలో 14 రోజుల హుండీ ఆదాయాన్ని మంగళవారం లెక్కించినట్లు ఈవో రమాదేవి తెలిపారు. హుండీ ద్వారా రూ.1,29,27,470 ఆదాయం లభించింది. వీటితో పాటు 60 గ్రాముల 500 మి.గ్రా బంగారం, 3 కిలోల 800 గ్రాముల వెండి లభించాయని ఈవో పేర్కొన్నారు. హుండీ లెక్కింపులో ఏసీ కార్యాలయ పరిశీలకులు రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.