రాష్ట్ర ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు: మల్లారెడ్డి

రాష్ట్ర ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు: మల్లారెడ్డి

TG: రెండేళ్లుగా రాష్ట్ర ప్రజలు నానా కష్టాలు పడుతున్నారని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని విమర్శించారు. మహిళలకు స్కూటీలను, రూ.2500, అవ్వలకు రూ.4 వేలు పెన్షన్ ఇస్తామని ప్రకటించి మహిళలను మోసం చేశారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మహిళలు బుద్ధి చెప్తారని అన్నారు.