కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
NLG: ఆడబిడ్డలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. బుధవారం కట్టంగూర్ మండలంలోని ఎమ్మార్వో కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళకు ఉచిత బస్సు, వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం అందిస్తుందన్నారు.