మాజీ ఎంపీ కుసుమ కృష్ణమూర్తి మృతి

మాజీ ఎంపీ కుసుమ కృష్ణమూర్తి మృతి

కోనసీమ: అమలాపురం మాజీ ఎంపీ కుసుమ కృష్ణమూర్తి(85) మృతి చెందారు. ఆయనకు గుండెపోటు రావడంతో ఢిల్లీలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఆయన స్వగ్రామం అయినవిల్లి మండలం విలస గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆయన మూడుసార్లు ఎంపీ గా ఎన్నికయ్యారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.