VIDEO: అదాలత్ వెంకటేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ
హనుమకొండ జిల్లాలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంగళవారం అదాలత్‌లోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్తులు ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకున్నారు. ఉదయం నుంచే నియమనిష్టలతో భక్తజనం ఆలయానికి చేరుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.