గురుకుల పాఠశాలను సందర్శించిన కలెక్టర్

గురుకుల పాఠశాలను సందర్శించిన కలెక్టర్

MNCL: చెన్నూర్ మండల మహాత్మ జ్యోతిబా ఫూలే గురుకుల బాలుర ఉన్నత పాఠశాలను గురువారం కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు. వంటశాల, తరగతి గదులు, మధ్యాహ్న భోజనం నాణ్యత, పరిసరాలను పరిశీలించారు. ప్రభుత్వం విద్యార్థులకు సకల సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించేందుకు అన్ని ప్రభుత్వ పాఠశాలలలో అభివృద్ధి పనులు చేపట్టి సౌకర్యాలు కల్పించడం జరిగిందని తెలిపారు.