నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

SKLM: పాతపట్నం సబ్ స్టేషన్ పరిధిలో బుధవారం విద్యుత్ లైన్ మరమ్మతులు చేపట్టనున్నారు. దీంతో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని టెక్కలి విద్యుత్ శాఖ ఈఈ జి.శంకరరావు తెలిపారు. పాతపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్, సాయి నగర్ కాలనీ, దశరథపురం, తిడ్డిమి, రంకిణి, సూర్య నారాయణపురం, చంగుడి తదితర గ్రామాలకు విద్యుత్ అంతరాయం ఉంటుందని తెలిపారు.