ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేసిన మంత్రి
NGKL: పెంట్లవెల్లి మండలం గోపాలపురంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం భూమిపూజ చేశారు. లబ్ధిదారులతో కలిసి ఆయన పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదల కలలను నిజం చేసేందుకు ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. సకాలంలో ఇళ్లు పూర్తి చేసుకుని రూ.5 లక్షల ఆర్థిక సాయం పొందాలని లబ్ధిదారులకు సూచించారు.